ఛత్తీస్‌గడ్ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్టు చేసి.. 80 బాంబులు, జిలెటిన్ రాడ్, రెండు డిటోనేటర్లు, బాణాసంచాతో పాటు మావోయిస్టు సాహిత్యంను పోలీసులు సీజ్ చేశారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో హేమ్లా నంద అనే మావోయిస్టు పట్టుబడినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో సీఆర్పీఎఫ్ బలగాలు కూడా పాల్గొన్నాయి. నహది, చోటిహిడ్మా గ్రామాల మధ్య కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు.










