ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో సినీ పక్కీలో యువకుడిని కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే యువకుడిపై దాడి చేసి కారులో ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమై ఛేదించారు కారు, యువకులను అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసి కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










