Aug 31,2023 16:11

న్యూఢిల్లీ : చంద్రుని ఉపరితలంపై ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరుగుతున్న వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ఈ రోవర్‌ చంద్రుని ఉపరితలంపై క్రేటర్స్‌, రాళ్లు లేకుండా ఉండేందుకు అన్వేషిస్తోంది. వచ్చేవారంలో ప్రారంభమయ్యే చంద్రుని రాత్రి (ఇది భూమిపై 14 రోజులు.. చంద్రునిపై 12 గంటలతో సమానం) కంటే ముందే ఈ ప్రయోగాలను పూర్తి చేయడానికి ప్రజ్ఞాన్‌ రోవర్‌, విక్రమ్‌ ల్యాండర్‌ ఒకదానికొకటి పోటీ పడుతున్నాయని ఇస్రో తెలిపింది.
కాగా, చంద్రునిపై రోవర్‌ తిరిగేది ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా ద్వారా ఈ వీడియోను ఇస్రో 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోపై.. 'చందమామ పెరట్లో చిన్నపిల్ల ఉల్లాసంగా ఆడుతుంటే అమ్మ ఆప్యాయంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది' అనే క్యాప్షన్‌ను ఇస్రో జత చేసింది.