Jul 25,2023 22:10

- ఐదవ రౌండ్‌ ప్రారంభం
ప్రజాశక్తి - సూళ్లూరుపేట :ఈ నెల 14న ఇస్రో నుంచి ప్రయోగించిన చంద్రయాన్‌-3 ప్రస్తుతం భూమి చుట్టూ తిరిగే ప్రక్రియలో భాగంగా నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఐదవ రౌండును ప్రారంభించింది. చంద్రయాన్‌-3 ముందుగా భూమి చుట్టూ ఐదు రౌండ్లు తిరిగిన తరువాత తన ప్రయాణాన్ని చంద్రుని వైపునకు మళ్ళిస్తుంది. భూమి చుట్టూ తిరిగే చివరి రౌండును ఆగస్టు 1 వ తేదీ రాత్రి 12 గంటలకు పూర్తి చేసుకొని తదుపరి చంద్రుని వైపునకు వెళ్లే ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.