ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో రైతులకు ఉచిత భోజన పథకాన్ని యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసు రత్నం సోమవారం ప్రారంభించారు. యార్డులో రైతులు, కమిషన్ ఏజెంట్లు, హమాలీలు, ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రైతులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేస్తామన్నారు. తాము తరచుగా భోజనం నాణ్యతను తనిఖీ చేస్తామని, ఏమైనా తేడా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, యార్డు కార్యదర్శి ఐ. వెంకటేశ్వర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.










