Feb 18,2023 11:56

ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : 216 ఏ జాతీయ రహదారి పక్కన మండలంలోని మడికి అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్లో జరుగుతున్న మహా అన్నదానంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు పాల్గొన్నారు. ముందుగా మార్కెట్లో నెలకొల్పిన శ్రీఅభయ ఆంజనేయస్వామిని స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరికి కూరగాయల మార్కెట్‌ కమిటీ సభ్యులు పాలూరి సత్తిబాబు, దొండపాటి వెంకటేశ్వరరావు, పర్వతనేని వెంకట రామారావు, చెల్లుబోయిన సింహాచలం, అందే బుజ్జి, అయినవిల్లి నాగేశ్వరరావు, వీరబాబు, సుబ్బరాజులు సాదర స్వాగతం పలికారు. అలాగే ఈ అన్నదానంలో ప్రతి ఒక్కరూ పాల్గని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ప్రతి ఏటా మహాశివరాత్రి నాడు భారీ అన్నసమారాధన ఈ కూరగాయల మార్కెట్‌ నందు జరుగుతూ వస్తోందన్నారు. గత ఏడాది సుమారు 16 వేల మంది విచ్చేసారని, ఇప్పుడు మరింత మందికి ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.