Sep 21,2023 15:28

ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్య) : నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె వినాయక ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని డి.ఆర్‌.డి.ఏ రాష్ట్ర మాజీ అధికారి యల్లటూరు శ్రీనివాసరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలు మతసామరస్యానికి ప్రతీకలన్నారు. హిందువుల తొలి పండగ అయిన వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు యల్లటూరు శివరామరాజు, సింగంశెట్టి నరేంద్ర, మాజీ సర్పంచ్‌ సమ్మెట శివప్రసాద్‌, ఆలయ కమిటీ ఆకేపాటి జగదీశ్వర్‌ రెడ్డి, మేడా వెంకట కుమార్‌, పల్లె మాధవి, ఒబిలి రామ్మోహన్‌ రెడ్డి, రాజాచారి, పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.