Aug 28,2023 11:42

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో సత్యసాయి పంప్‌ హౌస్‌ వద్ద సత్యసాయి కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారంతో నాలుగవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ... 5 నెలల వేతనాలు, 8 నెలల పిఎఫ్‌, 18 నెలల ఈఎస్‌ఐ, రెండు సంవత్సరాలు లీవ్‌ ఎంకాష్మెంట్‌, బోనస్‌ను చెల్లించాలని తెలిపారు. తమకు రావల్సినవన్నీ చెల్లించేవరకు మోటార్లు ఆన్‌ చేసేదిలేదని జిల్లా కమిటీ నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నా, తిరుపాల్‌ నాయక్‌, శ్రీరాములు, హరి, ఓబన్న, వీరయ్య, వెంకటేష్‌ నాయక్‌, చిన్నకేశవులు, శ్రీధర్‌, మల్లి పాల్గొన్నారు.