Sep 14,2022 16:04

ప్రజాశక్తి-చల్లపల్లి(కృష్ణాజిల్లా) : మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక మండల విద్యాశాఖ అధికారికి అనిల్‌ కుమార్‌కు సిఐటియు నాయకులు, కార్మికులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల శాఖ అధ్యక్షుడు మొహమ్మద్‌ కరీముల్లా మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ప్రైవేటుగా అప్పగించ రాదన్నారు. కార్మికులకు కనీస వేతనం 26 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. కార్మికులకు భీమా ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని, ఈ పథకం అమలుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షురాలు ఎన్‌. వెంకటేశ్వరమ్మ, యు వెంకటేశ్వరమ్మ, బి లక్ష్మి కుమారి, ఏం. ఫాతి మున్నీసా. బి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.