Jul 05,2023 13:03

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పంటల బీమా పంపిణీలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నష్టపోయిన పంటలన్నింటికీ బీమా వర్తింపచేయాలని టిడిపి నాయకులు కోరారు. బుధవారం టిడిపి ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల పరిధిలో ఆర్‌.బి.కె వద్ద ధర్నా చేపట్టారు. వ్యవసాయ అధికారి సుచరితకు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పంటల బీమా కేవలం పత్తి, చీని పంటలకు మాత్రమే ఇవ్వడంతో ఇతర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పడం కేవలం పేపర్‌ ప్రకటనలకే పరిమితమైందని ఆచరణలో మాత్రం శూన్యం అన్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలకు సరైన దిగుబడి రాక ప్రకఅతి వైపరీత్యాలైన అతివఅష్టి, అనావఅష్టి వలన జిల్లా వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. గ్రామస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామ, మండల, వ్యవసాయ అధికారులు గుర్తించి అన్ని రకాల పంటలకు పంటల బీమా వర్తించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వానికి పంపి రైతులకు లబ్ధి చేకూరేలా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోవడం తథ్యమన్నారు. వ్యవసాధికారికి వినతి పత్రం సమర్పించారు. అధికారిణి మాట్లాడుతూ .... జిల్లా అధికారుల వద్దకు ఈ వినతులను తీసుకెళ్లి పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ శ్రీనివాసులు, కఅష్ణమోహన్‌ చౌదరి, బాలు, రాజా, రమేష్‌, మంగళ ఆనంద్‌, బొమ్మయ్య, అకులన్న బాబా, మాజీ ఎంపీపీ మారెక్క పద్మావతి, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.