Jan 22,2021 12:27

కర్నూలు : కర్నూలు జిల్లాలోని వివిధ ప్రార్థనాలయాల వద్ద పోలీసులు నిఘాను పెంచారు. దీనిపై గురువారం జిల్లా ఎస్పీ ఫకీరప్ప కాగినెల్లి సిఐ లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి నిర్దేశం మేరకు... నిన్న అర్ధరాత్రి నుంచే పోలీసులు ఆయా ప్రార్థనాలయాల వద్ద పహారాను చేపట్టారు. డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది రాత్రి పూట పెట్రోలింగ్‌ చేస్తూ ఆలయాల భద్రతను పరిశీలిస్తున్నారు.