ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : స్థానిక సంగమేశ్వర కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పాఠశాల ప్రదానోపాధ్యాయులు ముత్యాల మాణిక్యాంబ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి పండుగ బుధవారం నిర్వహించారు. పేద, ధనిక, కుల, మత, వర్ణ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు ఈ రాఖీ పండుగను జరుపుకోవాలని తమకు రాఖీలు కట్టిన అక్కలు, చెల్లెళ్లకు అన్నదమ్ములు బహుమతులు ఇచ్చి సంతోషపెడతారని ఉపాధ్యాయులు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు విద్యార్థులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.










