న్యూఢిల్లీ : రాఖీ పండుగను భారత్‌లోని అక్కా తమ్ముడు, అన్నా చెల్లెలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. దీనికి సెలబ్రిటీలు కూడా అతీతమేమీ కాదు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఆయన సోదరి ప్రియాంక గాంధీ.. తమ జీవితంలోని గత జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాల్యం నుండి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోలను జత చేసి.. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తన సోదరుడిని మెచ్చుకుంటూ గతంలో మాట్లాడిన ఓ వీడియోను ఈ సందర్భంగా ప్రియాంక షేర్ చేసుకున్నారు. అటు రాహుల్ సైతం.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంకతో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. తాను, ప్రియాంక కలిసి పెరిగామని, జీవితంలో కష్ట సుఖాలను చూశామని, ఒకరిలో ఒకరం ధైర్యాన్ని నింపుకున్నామని పేర్కొంటూ.. ఈ సోదరీసోదరుల మధ్య బంధం చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియలో పోస్టు చేశారు.
<<
/p>
<
भाई-बहन के पवित्र रिश्ते का सबसे ख़ूबसूरत दिन, आज देश भर में राखी का त्योहार धूम-धाम से मनाया जा रहा है।
— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2022
रक्षाबंधन के पावन पर्व पर सभी देशवासियों को मेरी हार्दिक शुभकामनाएं। मैं कामना करता हूं कि हर भाई-बहन के बीच का प्यार हमेशा बना रहे। pic.twitter.com/D7G4BIQGLN










