ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం 5వ విడతగా శుక్రవారం రూ.24 వేలు అర్హులైన ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లోకి జమ చేసిన సందర్భంగా ... అమలాపురం రూరల్ సమనస గ్రామపంచాయతీ రంగాపురంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కరెళ్ళ రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర చేనేత సహకార ఉత్పత్తి సంఘం అధ్యక్షులు కరెళ్ళ వెంకటేశ్వరరావు అధ్యక్షతన లబ్ధి పొందిన చేనేత కార్మికులు అందరూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం చేసి స్వీట్లు పంచి పండగ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రెటరీ కరెళ్ళ నాగరాజు, డైరెక్టర్ కరేళ్ల మహేష్, సచివాలయ కన్వీనర్ అక్కిశెట్టి ప్రసాద్, సమనస, వన్నెచింతలపూడి, రంగాపురం గ్రామాల చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.










