Mar 27,2023 09:05
  • రూ.1,439 కోట్లతో 40 కిలోమీటర్ల విస్తరణ : కేంద్ర మంత్రి నితీన్‌ గడ్కరీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో కాకినాడ జిల్లా వాకలపూడి నుండి అన్నవరం వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి ఆమోదించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితీన్‌ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రి నితీన్‌ గడ్కరీ ప్రకటించారు. భారతమాల పరియోజన ఫేజ్‌-1లో భాగంగా, జాతీయ రహదారి 516 ఎఫ్‌లోని జాతీయ రహదారి 16లో వాకలపూడి లైట్‌ హౌస్‌ నుండి అన్నవరం వరకు నాలుగు లైన్ల హైవే నిర్మాణం చేపడతామని, అందుకు రూ.1,439.88 కోట్ల మొత్తాన్ని ఆమోదించామని తెలిపారు. ప్రతిపాదిత లే అవుట్‌ 40.621 కిలోమీటర్ల విస్తరించి, హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌లో అమలు చేయబడుతుందని పేర్కొన్నారు.