తెలంగాణ : మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ... రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాకు వివరణ ఇస్తూ ... బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌ను భావిస్తున్నారని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎవరి ఇష్టం వారిది అన్నారు. బిఆర్‌ఎస్ కు బిజెపి ప్రత్యామ్నాయం కాదన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. వారు అనుకుంటే బిజెపి బిఆర్‌ఎస్ కు పోటీ కాకుండా పోదు అని వ్యాఖ్యానించారు.










