May 20,2023 17:29

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (12862) రైలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. శనివారం మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రాంతం అభివఅద్ధి చెందాలన్నా రోడ్డు, రైలు, ఎయిర్‌ కనెక్టివిటీ ఉండాలన్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృధ్ధి చెందాలంటే కనెక్టివిటీ అవసరమన్న ఆయన.. త్వరలో ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ను షాద్‌నగర్‌లో ఆపాలని స్థానికులు కోరారని, ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం దఅష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రైల్వే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.