ఉత్తర్‌ప్రదేశ్ : ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చూశారని సొంత చెల్లెళ్లనే హతమార్చిందో యువతి.. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్రారు పోలీస్‌స్టేషను పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌పుర్ గ్రామానికి చెందిన అంజలి (20) తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిచింది. అతడితో ఆమె సన్నిహితంగా ఉండగా.. తన చెల్లెళ్లు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతారేమోనని భయపడిన అంజలి చిన్నపిల్లలని కూడా చూడకుండా చంపేసింది. చెల్లెళ్లను ఎవరో చంపేశారని తల్లిదండ్రుల ముందు కట్టుకథ సృష్టించింది. ఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న అంజలి దుస్తులను గుర్తించిన పోలీసులు ఆమెను నిలదీశారు. అసలు విషయం వెలుగులోకి రావడంతో నిందితురాలిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అంజలికి మరికొందరు సహకరించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.










