Jul 07,2023 12:45

గోరఖ్‌పూర్‌ : ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మరో రెండు వందేభారత్‌ రైళ్లను ప్రారంభించారు. గోరఖ్‌పూర్‌ - లక్నో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, జోధ్‌పూర్‌ అహ్మదాబాద్‌ (సబర్మతి) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను జెండా ఊపి మోడీ ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా వందే భారత్‌ రైళ్ల సంఖ్య 25కి చేరిందని కేంద్ర ప్రభుత్వ అధికారిక ట్వీట్‌లో పేర్కొంది.
కాగా, గోరఖ్‌పూర్‌ - లక్నో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బాబా గోరఖ్‌నాథ్‌, లార్డ్‌ రామ్‌, అయోధ్య, నవాబ్స్‌ నగరాల మీదుగా లక్నోకి కలుపుతుంది. వీటితోపాటు 15వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి కబీర్‌ పట్టణం, సిద్ధార్థ్‌నగర్‌, సంత్‌ కబీర్‌నగర్‌ వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ప్రయోజనం ఉంది. ఇక జోధ్‌పూర్‌ -సబర్మతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాజ్‌పుతానా, అహ్మదాబాద్‌ నగరాలకు కనెక్టివిటీ ఉంది. ఈ రైలు మార్గంలో పాలి, అబు రోడ్‌, పాలన్‌పూర్‌, మెహసానా నగరాలను కలుపుతుంది.