ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రం అయిన నార్పలలో ఖరీఫ్ 2023 సంబంధించి వేరుశనగ పంపిణీ కార్యక్రమం సోమవారం లాంఛనంగా ప్రారంభించారు అని ఉండాల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. సబ్సిడీ రూ.1116 ఫోను ఒక బ్యాగు ధర రూ.1674గా నిర్ణయించిందని తెలిపారు. అవసరమైన మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. వేరుశనగ తీసుకున్న రైతులు తప్పనిసరిగా విత్తుకోవాలని అన్నారు. విత్తుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ రాయితీ అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన. ఎంపీపీ, నాగేశ్వరావు మాట్లాడుతూ గతంలో రైతులు విత్తన కాయల కోసం మండల స్థాయిలో వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలలో విత్తన సరఫరా చేయడం అభినందినీయమని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా చైర్మన్ నాగలింగారెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ లోకనాథ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పెద్దిరెడ్డి ఎంపిటిసి రాజారెడ్డి , గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.










