ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు సైన్స్ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయని రూరల్ ఎస్సై బి.శివకృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని తాపేశ్వరం శ్రీచైతన్య స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్‌పొను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులను స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణతో కలిసి తిలకించారు. ఈ ఎగ్జిబిషన్ లో ఎక్వేరియం, వాటర్ ప్యూరిఫైయర్, లేజర్ స్క్రీన్, ఎఫెక్ట్స్ వాటర్ పొల్యూషన్, సోలార్ ఎనర్జీ, లేజర్ సెక్యూరిటీ అలారం తదితర ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ... విద్యార్థులలో సైన్స్‌పై నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం వ్యాచరచన, క్విజ్ కాంపిటీషన్లోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిజనల్ ఇన్ ఛార్జ్ నరేష్, వైస్ ప్రిన్సిపల్ రాము, సిఇంచార్జ్ అరుణ్, ఉపాధ్యాయలు, సిబ్బంది పాల్గొన్నారు.










