విద్య ద్వారా పేదరిక నిర్మూలన చేయొచ్చు : జెఎన్‌టియు సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రమణారెడ్డి
ప్రజాశక్తి-అనంతపురం : విద్య ద్వారా పేదరిక నిర్మూలన చేయొచ్చని అనంతపురం జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీనియర్ ఆచార్యులు డాక్టర్ పి.రమణా రెడ్డ్ తెలిపారు. మంగళవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ... కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం మూడవ సంవత్సరం విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెమినార్ హల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విభాగ అధిపతి డాక్టర్ ఎస్.చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వేపల్లి జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యారంగానికి సేవలు చేయడమే కాకుండా భారత రాష్ట్రపతిగా సేవలు అందించారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి విద్యార్థులు, అధ్యాపకులు పనిచేసినప్పుడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణకు నిజమైన నివాళి ఇచ్చినట్లు అని అన్నారు. ఈ కార్యక్రమములో బోధనా సిబ్బంది డాక్టర్ బి.విష్ణు వర్ధన్ రెడ్డి, డాక్టర్ జి.మమత, డాక్టర్ డి.లలిత కుమారి, విద్యార్థులు, బోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.










