ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 17న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు స్ట్రగుల్ కమిటీ చైర్మన్ సుదర్శన్ తెలిపారు. పే రివిజన్, ఇతర సమస్యలకు సంబంధించి ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేస్తున్నారని, కాంట్రాక్టు, పర్మినెంటు వర్కర్లు ఎక్కడికక్కడ కార్మిక కమిషనర్లకు తమ అభ్యంతరాలు సమర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంగళవారం తెలిపారు. అయితే, చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని, ఎప్పుడనేది ఒకట్రెండు రోజుల్లో చెబుతామని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.










