లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నిర్వాహకులు 2వ సీడ్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్‌కు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా రాకెట్‌ను నెట్‌కేసి కొట్టినందుకు గాను అతనికి జరిమానా విధిస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ పైనల్ ఉత్కంఠ పోటీలో భాగంగా ఐదో సెట్‌లో జకోవిచ్ అలా ప్రవర్తించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. కీలకమైన ఐదో సెట్‌లో జకో సర్వీస్‌ను అల్కరాస్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత అల్కరాస్ సర్వీస్‌ను జకోవిచ్ బ్రేక్ చేయలేకపోయాడు. ఆ సమయంలో కోపం పట్టలేక జకో రాకెట్‌ను నెట్ పోస్ట్‌కు కొట్టి విరగ్గొట్టాడు. అక్కడే ఉన్న అంపైర్ జకోవిచ్‌ను మందలించడమే గాక.. నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం జకో వ్యవహారాన్ని పరిశీలించిన నిర్వాహక కమిటీ.. అతడి చర్యను తప్పుగా తేల్చింది. వింబుల్డన్ ఆస్తులను డ్యామేజ్ చేసినందుకు గానూ అతడికి 8000 డాలర్ల జరిమానా విధించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ ధ్రువీకరించింది. ఈ మొత్తాన్ని జకోవిచ్ రన్నరప్‌గా అందుకున్న ప్రైజ్ మనీ నుంచి తీసుకోనున్నట్లు తెలిపింది.










