లక్నో: మొరాకోతో శనివారం జరిగే డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్-2 ప్లే-ఆఫ్‌లో తలపడే భారత టెన్నిస్ ఆటగాళ్ల జాబితాను భారత టెన్నిస్ సమాఖ్య మంగళవారం ప్రకటించింది. లక్నో వేదికగా వైజయంత్ ఖాండి మినీ స్టేడియంలో జరిగే డేవిస్ కప్ పోటీలు జరగనున్నాయి. యుఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ రన్నరప్ 43 ఏళ్ల రోహన్ బొప్పన్నకు డబుల్స్ విభాగంలో చోటు దక్కింది. ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బొప్పన్న 17వ స్థానంలో ఉన్నాడు. మొత్తం ఆరుగురు ఆటగాళ్లతో కూడిన భారత డేవిస్ కప్ జట్టును భారత టెన్నిస్ సమాఖ్య వెల్లడించింది. సింగిల్స్‌లో టాప్ ర్యాంకర్ సుమిత్ నాగల్‌తోపాటు శశికుమార్ ముకుంద్, దిగ్విజరు ప్రతాప్ సింగ్, యుకీ బాంబ్రీ మరియు రామ్‌కుమార్ రామనాథన్ మిగిలిన ఆటగాళ్లు.










