Aug 30,2023 17:34

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నియామక ప్రక్రియలో భాగంగా దేహదారుడే పరీక్షలు వివిధ దశల్లో జోరుగా జిల్లాలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ బుధవారం ఈ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటనను చేసింది. ప్రాథమిక రాత పరీక్ష దేహదారుడ్య పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఫైనల్‌ రాత పరీక్షను అక్టోబర్‌ 14 15వ తేదీలలో నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న ఆ విధంగా రాష్ట్రంలో విశాఖ గుంటూరు ఏలూరు కర్నూలు జిల్లాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. పరీక్షల్లో మొత్తం నాలుగు పేపర్లు అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఒకటి రెండు పేపర్లు రాత పూర్వక పరీక్ష, మూడు నాలుగు పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నిర్వహించనున్నట్లు పోలీస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డ్‌ బుధవారం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఫిబ్రవరి 19వ తేదీన ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించింది. అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈనెల 25వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. రాయలసీమ జోన్‌ పరిధిలోని అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ నిమిత్తం కర్నూలు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌ మైదానాన్ని వేదికగా నిర్ణయించింది. దేహదారుడ్య పరీక్షలు మొదలై ఇప్పటికే ఐదవ రోజు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఈ మేరకు రాయలసీమ జోన్‌ పరిధిలో కర్నూలు రేంజ్‌ డిఐజి ఎస్‌. సెంథిల్‌ కుమార్‌, ఎస్పీ జి. కష్ణకాంత్‌ లు దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. రాయలసీమ రేంజ్‌ పరిదిలో 16 వేల 108 మంది అభ్యర్దులు పాల్గొంటున్నారు. ఇందులో 14,011 మంది పురుషులు, 2, 097 మంది మహిళ అభ్యర్దులు ఉన్నారు. ప్రతి రోజు 8 వందల మంది అభ్యర్దులు దేహ దారుడ్య పరీక్షలలో పాల్గొంటారని , పోలీసు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్‌ జంప్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో అత్యధిక సాంకేతికత తో కూడిన పరికరాలను వినియోగిస్తుండడం విశేషం. ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి వివిధ జిల్లాలలోని 3 వందల మంది పోలీస్‌ సిబ్బందినివినియోగిస్తున్నారు.