ప్రజాశక్తి-మంత్రాలయం(కర్నూలు) : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వామిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కెవి ఉషా శ్రీ చరణ్ దర్శించుకున్నారు. సోమవారం దర్శనార్థం ఆలయం చేరుకున్న మంత్రిని శ్రీ మఠం మేనేజర్ యస్కే శ్రీనివాసరావు, శ్రీపతిఆచార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీ మఠం దివాన్ సుధీంధ్రాచార్ ఆమెకు పసుపు కుంకుమలతో చీర,రవికతో పాటు జ్ఞాపికను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణు గోపాల్ రాజు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










