ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల డిమాండ్ల సాధనకై చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘ నాయకులు, మంగళాపురం పీఏసీఎస్ సీఈఓ చండ్ర రవికుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం చల్లపల్లిలో రవికుమార్ మాట్లాడుతూ ... సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారుల దఅష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సహకార వ్యవసాయ సహకార సంఘాల ఐక్యవేదిక ఈ నెల 17న చలో విజయవాడకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ లో జరిగే సహకార ఉద్యోగుల ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రవికుమార్ పిలుపునిచ్చారు.










