అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఎటిపి) తాజా ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు సుమిత్ నాగల్ సింగిల్స్‌తో తన ర్యాంక్‌ను మెరుగు పరుచుకున్నాడు. ఎటిపి బుధవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సుమిత్ నాగల్ 178వ ర్యాంక్‌కు ఎగబాకాడు. అర్జెంటీనా వేదికగా జరిగిన ఛాలెంజర్స్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం సుమిత్ ర్యాంక్ మెరుగైంది. ఈ టైటిల్ కైవసం చేసుకోవడంతో 53 ర్యాంక్‌లు మెరుగుపరుచుకోగలిగాడు. సుమిత్ కెరీర్ బెస్ట్ 122వ ర్యాంక్ కాగా.. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 178వ ర్యాంక్‌లో నిలిచాడు. దీంతో త్వరలో జరిగే యుఎస్ ఓపెన్ క్వాలిఫయర్స్‌లో ఆడనున్నాడు. ఇక నోర్డియా ఓపెన్ ఫైనల్లో ఆండ్రీ రుబ్లేవ్.. కాస్పర్ రూఢ్‌ను ఓడించినా రూడ్ 4వ స్థానాన్ని నిలుపుకోగా.. రుబ్లేవ్ 7వ స్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూపోర్ట్ టైటిల్ విజేత ఆండ్రీన్ మన్నారినో 11 స్థానాలు మెరుగుపరచుకొని 27వ స్థానంలో నిలువగా.. అమెరికన్ టీనేజర్ అలెక్స్ మిఛెల్సన్ 50స్థానాలు మెరుగుపరచుకొని 140వ ర్యాంక్‌కు ఎగబాకాడు.
ఎటిపి టాప్-10 ర్యాంకింగ్స్..
1. కార్లోస్ అల్కరాజ్(స్పెయిన్) : 9375పాయింట్లు
2. నొవాక్ జకోవిచ్(సెర్బియా) : 8795 ,,
3. డానియెల్ మెద్వదెవ్(రష్యా) : 6520 ,,
4. కాస్పర్ రూఢ్(నార్వే) : 4905 ,,
5. స్టెఫొనాస్ సిట్సిపాస్(గ్రీస్) : 4850 ,,
6. హోల్జర్ రూనే(డెన్మార్క్) : 4825 ,,
7. ఆండ్రీ రుబ్లేవ్(రష్యా) : 4730 ,,
8. జన్నిక్ సిన్నర్(ఇటలీ) : 3975 ,,
9. టేలర్ ఫ్రిట్జ్(అమెరికా) : 3310 ,,
10. ఫ్రాన్సిస్ టఫీ(అమెరికా) : 3130 ,,










