Jul 29,2023 11:43

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ మహానగరం కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడింప చేయాలన్న సంకల్పంతో స్థాపించిన '' స్పిరిట్‌ ఆఫ్‌ వైజాగ్‌ సొసైటీ'' ఆధ్వర్యంలో విశాఖ మహా నగరంలో మొట్టమొదటిసారి వేలాది మంది మహిళలతో ''చేనేత చీర నడక'' కార్యక్రమాన్ని విశాఖ సముద్ర తీరంలో నిర్వహించి విశాఖ మహానగర మహిళల గొప్పతనాన్ని దేశానికి చాటాలని నిర్ణయించామని స్పిరిట్‌ ఆఫ్‌ వైజాగ్‌ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు వై సి హెచ్‌ దొరబాబు, సుధా పద్మశ్రీలు తెలిపారు. శనివారం ఉదయం మేఘాలయ హౌటల్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యదర్శులు మాట్లాడుతూ ... విశాఖ మహా నగర మహిళలు దేశానికి ఆదర్శంగా నిలవడంతో పాటు, భారతదేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన పొందూరు ఖద్దర్‌ నుండి రాష్ట్రములో చేనేత వఅత్తి ద్వారా తయారు చేస్తున్న చీరల ప్రత్యేకతను దేశ విదేశీ మహిళలు గుర్తించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విశాఖ మహిళలు ''హ్యాండ్లూమ్‌ సారీ వాక్‌'' కార్యక్రమానికి శ్రీకారం చుట్టగానే నగర నలుమూలల నుండి మహిళల నుండి విశేష స్పందన రావడం ఇప్పటికే సుమారు 4000 మంది మహిళలు తమ పేరును నమోదు చేసుకోగా, ఈ కార్యక్రమానికి స్పూరిగా రాష్ట్రములోని సెలబ్రెటీలతో పాటు భారతదేశ నటీనటులు సహా ఈ కార్యక్రమానికి మద్దతుని తెలియజేస్తూ ... హ్యాండ్లూమ్‌ సారీ వాక్‌ పోస్టర్ని వారి చేతుల మీదుగా విడుదల చేయడంతో పాటు తమ వీడియో సందేశాల ద్వారా ఈ మంచి కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గనాలని కోరారు. ఆగస్టు 6 తేదీ విశాఖ సముద్ర తీరంలో ఉదయం 6 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి నగర మేయర్‌ శ్రీమతి, గొలగాని హరివెంకటకుమారి, భారత ఒలంపిక్స్‌ మెడల్‌ విజేత, ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌, పద్మశ్రీ కరణం మల్లేశ్వరి, డాక్టర్‌ సువర్ణ వర్మ పాల్గొంటున్నారు. వారితోపాటు ఉభయ రాష్ట్రాలకు చెందిన అనేక సంస్థల ప్రముఖ మహిళలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాలవుతున్నారు. '' స్పిరిట్‌ ఆఫ్‌ వైజాగ్‌ సొసైటీ '' మొట్టమొదటి కార్యక్రమం, దేశంలోని మహిళలకు స్ఫూర్తిగా ఉండే ఈ కార్యక్రమంలో ఇంకా విశేషంగా మహిళలు పాల్గని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే విశాఖ మహానగరం పేరు మరింత ఇనుమడింప చేయాలన్న మా సంకల్పానికి ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఈ సమావేశంలో స్పిరిట్‌ ఆఫ్‌ వైజాగ్‌ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.