ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్ తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. ఈ మేరకు ఆస్పత్రి డైరెక్టరు సుధాకర్ కంటిపూడి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18న పొత్తికడుపు నొప్పొతో మణిపాల్ ఆస్పత్రిలో గవర్నరు చేరడం, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అదేరోజు రోబోటిక్ అపెండెక్టమీని వైద్యులు చేసిన సంగతి తెలిసిందే.










