Sep 25,2023 11:31

ఏలూరు : సిపిఎస్‌, జిపిఎస్‌ వద్దని, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని కోరుతూ ... ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజును పోలీసులు అరెస్టు చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ... ఉపాధ్యాయులంతా మోకాళ్లపై కూర్చొని ప్లకార్డులను చేతపట్టి నినదించి నిరసన తెలిపారు.