Nov 12,2022 08:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని గ్రామాల్లో భూమిలేని పేదలందరికీ పింఛను సొమ్మును ప్రతి నెలా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని సిఆర్‌డిఎ కమిషనరు వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతిలోని 29 గ్రామాల్లో భూమిలేని 19,110మంది పేదలకు రూ.2,500 చొప్పున పింఛను సొమ్మును వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.