Jul 22,2023 13:01

అమరావతి : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని... తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్‌-కటక్‌-హైదరాబాద్‌ (07615-07166) రైలును ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 27వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది.

మిగిలిన రైళ్ల వివరాలు..
తిరుపతి-జల్నా: ఆగస్టు 1 - సెప్టెంబర్‌ 26.
జల్నా-తిరుపతి: ఆగస్టు 6 - అక్టోబర్‌ 1.
జల్నా-చాప్రా: ఆగస్టు 2 - సెప్టెంబర్‌ 27.
చాప్రా-జల్నా: ఆగస్టు 4 - సెప్టెంబ్‌ 29.
హైదరాబాద్‌-గోరఖ్‌పూర్‌: ఆగస్టు 4 - సెప్టెంబర్‌ 29.
గోరఖ్‌పూర్‌-హైదరాబాద్‌: ఆగస్టు 6 - అక్టోబర్‌ 1.

11