ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండలంలోని ఆర్ బి కే కేంద్రాలలో రాయితీపై విత్తన వేరుశెనగ పంపిణీ సోమవారం ఏవో వెంకటేశ్వర ప్రసాద్ ప్రారంభించారు. సోమవారం వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ... మండల వ్యాప్తంగా ఆర్బికే కేంద్రాల్లో వేరుశనక్కాయలు ప్రారంభించారు. ప్రతి ఒక్క రైతు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఎల్ ఆర్ జి 52 కందిరకం 50 కింటాలు రావడం జరిగిందని, కావలసిన రైతులు ఆర్ వి కె కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమలత వైస్ ఎంపీపీ నీలిమ వైస్ ఎంపీపీ విజరు ఆత్మకూరు గ్రామ సర్పంచ్ వరలక్ష్మి ఉప సర్పంచ్ చంద్రకళ దుబ్బ చంద్రశేఖర్ రెడ్డి కొండారెడ్డి వెంకటరాముడు లక్ష్మీనారాయణ రెడ్డి నరసింహారెడ్డి అతికి రెడ్డి గోపాల్ ప్రసాద్ రామంజి వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు










