Nov 14,2022 16:00

హైదరాబాద్‌ : తెలుగు సినీ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం షూటింగ్‌లో ఉండగా అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతడిని హుటాహుటిన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.