గచ్చిబౌలి (హైదరాబాద్) : హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో టిడిపి అధినేత చంద్రబాబుకు మరోసారి పలు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యలకు డాక్టర్లు చికిత్స చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజులపాటు ఏఐజీలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరిగాయి. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. రేపు చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరగనుంది.










