చెన్నై : తమిళనాడు రాష్ట్ర క్యాబినేట్‌లో వి సెంథిల్ బాలాజీని మంత్రిగా కొనసాగించడంపై నిర్ణయం తీసుకునే విజ్ఞతను ముఖ్యమంతి ఎంకె స్టాలిన్‌కే మద్రాస్ హైకోర్టు వదిలివేసింది. ఎలాంటి మంత్రి పదవి లేకుండా మంత్రివర్గంలో సెంథిల్ బాలాజీని కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజరు విజరుకుమార్ గంగాపూర్వాలా, జస్టిస్ పిడి ఆదికేశవులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.










