ఢిల్లీ :ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ ప్రైజ్ విజేత అమర్త్యసేన్ (89) క్షేమంగానే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనారోగ్యంతో అమర్త్యసేన్ కన్ను మూశారంటూ ఆంగ్ల మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కుమార్తె నందన ఖండించారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం అమర్త్యసేన్ కన్నుమూసినట్టు వార్తలు రావడంతో పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై వెంటనే కుటుంబ సభ్యులు స్పందించి వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.










