Jul 11,2023 18:15

హైదరాబాద్‌: తిరుపతి రైల్వేస్టేషన్‌ అప్‌గ్రేడేషన్‌, మౌలికవసతుల అభివఅద్ధి పనులు జరుగుతుండటంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట, చెన్నై, అరక్కోణం నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే ఎనిమిది రైళ్ల రాకపోకలను పలు తేదీల్లో దాదాపు నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, హైదరాబాద్‌, కడప, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై సెంట్రల్‌, చామరాజనగర్‌, రామేశ్వరం, కదిరిదేవరపల్లి, గుంతకల్‌, హుబ్బళ్లి, విల్లుపురం, పూర్ణ, భువనేశ్వర్‌, హావ్‌డా నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే పలు రైళ్లను ఈ కింద చార్ట్‌లో పేర్కొన్న తేదీల్లో రేణిగుంట-తిరుపతిబీ పాకాల-తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే, కాచిగూడ-మదురై, తిరువనంతపురం-హజ్రత్‌నిజాముద్దీన్‌, ఎర్నాకుళం-హజ్రత్‌ నిజాముద్దీన్‌, హతియా-బెంగళూరు వెళ్లే పలు రైళ్లను మెల్పక్కం వద్ద మళ్లించనున్నట్టు అధికారులు తెలిపారు.