Aug 11,2021 12:16

అమరావతి : సీరియల్స్‌, మూవీస్‌, న్యూస్‌, ప్రోగ్రామ్స్‌... ఒకటేమిటి చాలా వివరాల కోసం యూట్యూబ్‌ను సెర్చ్‌ చేయనివారుండరు. యూట్యూబ్‌లో ఒక వీడియోను చూస్తుంటే కాస్త నచ్చకపోయినా, లేదా తరువాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతతో ఫోన్‌లో డబల్‌ ట్యాప్‌ చేసి వీడియోలను ఫార్వర్డ్‌ చేస్తూ ఉంటాం. వీడియోలను ఫార్వర్డ్‌ చేసే క్రమంలో డబుల్‌ ట్యాప్‌ సరిగ్గా చేయకపోతే వేరే వీడియోకు వెళుతుంది. ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటారు. ఇక ఈ సమస్యకు చెక్‌పెడుతూ ఓ కొత్త ఫీచర్‌ ద్వారా యూట్యూబ్‌ కొత్త పరిష్కారాన్ని చూపింది.

స్లైడ్‌ టూ సీక్‌ అనే కొత్త ఫీచర్‌..
యూజర్లకు స్లైడ్‌ టూ సీక్‌ అనే కొత్త ఫీచరును యూట్యూబ్‌ త్వరలోనే యాడ్‌ చేయనుంది. వీడియోను చూసే సమయంలో వీడియోపై ఒక గీతపై డాట్‌ ఉండే సింబల్‌ త్వరలోనే యూజర్లకు కనిపించనుంది. సింబల్‌కు పక్కనే 'స్టైడ్‌ టూ లెఫ్ట్‌ ఆర్‌ రైట్‌ టూ సీక్‌'డిస్క్రిప్షన్‌ మేసేజ్‌ కన్పిస్తోంది. దీనితోపాటు.... ఆపిల్‌, షావోమీ స్మార్ట్‌ఫోన్లలో కన్పించే రౌండ్‌బాల్‌ హౌల్డ్‌ గెస్చర్‌ను కూడా యూట్యూబ్‌ అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఒక వీడియోలో ముందుకు ఫార్వర్డ్‌ వెళ్లాలంటే బాల్‌ను డ్రాగ్‌ చేస్తే సరిపోతుంది. మనకు నచ్చినట్లుగా వీడియోలను ఫార్వర్డ్‌, రివైండ్‌ చేయవచ్చును. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను యూట్యూట్‌ పరీక్షిస్తుంది. ఈ ఫీచర్‌ యూట్యూబ్‌ యాప్‌ వెర్షన్‌ 16.31.34 వాడుతున్న ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.