ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉన్న ఓ సినిమా థియేటర్ క్యాంటీన్లో శుక్రవారం ఒక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతి అనుమానాస్పదంగా ఉందని భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి కంబపు సాయిగా గుర్తించారు. మృతుడు అదే థియేటర్లో క్యాంటీన్లో పని చేస్తున్నాడని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.










