May 05,2023 22:11

రాస్తారోకోలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రాష్ట్రంలోని యువతను జగన్‌ సర్కార్‌ పెడదారిన పట్టిస్తోందని యువత మద్యం, గంజాయికి బానిస అయ్యేలా చేస్తోందని టిడిపి నాయకులు ఆరోపించారు. మద్యం గంజాయి కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేస్తామని మేనిఫెస్టో లో పొందుపరచి తీరా అధికారం లోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్‌ రెడ్డి మద్యపాన నిషేధం అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి హిందూపురం పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోపురిశెట్టి చంద్రశేఖర్‌ తెలుగు యువత అధ్యక్షుడు బాబ్జాన్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజశేఖర్‌ బాబు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ సల్మాన్‌ ఖాన్‌, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు