మాల మహానాడులో చేరిన యువత
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
యువత రాజకీయంగా ఎదగాలని మాల మహానాడు రాయలసీమ జిల్లాల అధ్యక్షులు రంగయ్య తెలిపారు. బుధవారం స్థానిక మాల మహానాడు కార్యాలయంలో జై భీమ్ యువదళం జిల్లా అధ్యక్షులు నల్లన, కార్యదర్శులు బలరాముడు, రాముడు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల యువత చేరారు. కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల యువతకు రంగయ్య చేస్తున్న కార్యక్రమాలు నచ్చి, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి చేరినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి న్యాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు. ఇకపై జైభీమ్ యువదళం సైన్యంలో చేరే యువకులు స్వతంత్రంగా రావచ్చని తెలిపారు. యువదళం జిల్లా నాయకులు బలరాం, రాముడు, బోయ లోకేష్, ఖాసీం, రాంకోటి, మౌలాలి, లక్ష్మి కాంత్, రాజకుమార్, చాకలి మల్లికార్జున, వడ్డే రమేష్ పాల్గొన్నారు.










