Aug 15,2023 21:12

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌

యువత పోరాటాల్లో రావాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌
ప్రజాశక్తి - నంద్యాల

      దేశ భవిషత్తును కోరుతూ యువత పోరాటాల్లోకి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ కోరారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ప్రయివేట్‌, వ్యాపార సంస్థలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద జిల్లా కార్యదర్శి టి.రమేష్‌ కుమార్‌ జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎందరో త్యాగ ఫలితంగా వచ్చిన స్వతంత్ర ఫలాలు కొందరికే అందుతున్నాయని అన్నారు. 76 సంవత్సరాల నుండి పేదల జీవితాల్లో మార్పు లేదని, ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయని తెలిపారు. నేటి కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా దేశంలో మతోన్మాద చర్యలు పెరిగి పోయాయాని, ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. దేశ భవిషత్తును కోరుతూ యువత పోరాటాల్లోకి రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మద్దులు, నాగరాజు, నరసింహ, లక్ష్మణ్‌, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు : స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలని రిటైర్డ్‌ తాసిల్దార్‌ పి.రామకృష్ణుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసురత్నం అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ముందర జాతీయ జెండాను రిటైర్డ్‌ తహశీల్దార్‌ పి రామకృష్ణుడు ఆవిష్కరించారు. పిఎన్‌ఎం జిల్లా అధ్యక్షులు డాలు వెంకటేశ్వర్లు, సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్‌, మండల కార్యదర్శి నరసింహ నాయక్‌, నాయకులు శివమ్మ, షేక్‌ ఇస్మాయిల్‌ డి రామ్‌ నాయక్‌ జి నాగేశ్వరరావు, చందా వారి వెంకటేశ్వర్లు, ఎపి రైతు సంఘం మండల అధ్యక్షులు మా భాష, కార్యదర్శి వీరన్న, వాకిటి పేట కౌలు రైతు సంఘం నాయకులు ఆశ్రఫ్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు. పాములపాడు : పాములపాడు, లింగాల గ్రామాలలో రైతు సంఘం ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. జిల్లా నాయకులు రామేశ్వరరావు, మండల నాయకులు వెంకటేశ్వరరావు, ఎస్‌ఆర్‌ రమణ, సామన్నలు మాట్లాడారు. రమణమ్మ, బాల యేసు, రంగస్వామి, అంజలి, రంగయ్య, తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు టౌన్‌ : ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా సహాయ పిక్కిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జాతీయ జెండాను వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు ఆవిష్కరించారు. వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి పి పక్కిర్‌ సాహెబ్‌, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెస్తరాజు, సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు నాగన్న, ఆంజనేయులు, రామకృష్ణ, వ్యకాసం మండల నాయకులు కొణిదెల వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డక్కకుమార్‌, మహిళా సంఘం మండల నాయకురాలు ఎస్‌బిబి జయరాణి, రజియా, తదితరులు పాల్గొన్నారు. వెలుగోడు: పట్టణంలో ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని వెలుగోడు సర్పంచ్‌ వేల్పుల జయపాల్‌ అవిష్కరించారు. యాదాటి నాగేంద్రుడు అధ్యక్షతన జరిగిన ఈసభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ.రాజశేఖర్‌, సర్పంచ్‌ వేల్పుల జయపాల్‌, సిఐటియు నాయకులు మహమ్మద్‌ రఫీ పాల్గొన్నారు. మహానంది : మండలంలోని గాజులపల్లె సినిమా హాల్‌ సెంటర్‌ వద్ద ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామచంద్రుడు జెండా ఎగురవేశారు. వ్యకాసం నాయ కులు కోటకొండ భాష, మద్దిలేటి, రమణ తదితరులు పాల్గొన్నారు.