Jul 11,2023 17:00

నారా లోకేష్ వెంట పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి

యువగళం పాదయాత్ర ప్రజాగళం యాత్ర
మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ కోఆర్డినేటర్ బీసీ జనార్దన్ రెడ్డి
ప్రజాశక్తి - బనగానపల్లె

    యువగళం పాదయాత్ర ప్రజాగణం యాత్రగా మారిందని మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ కోఆర్డినేటర్ బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా కావలి నియోజకవర్గం లోని శ్రీపురం విడిది కేంద్రం నుండి ప్రారంభమైన యువగళం పాదయాత్ర లో  అడుగులో అడుగు వేస్తూ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. 2వేల కిలోమీటర్ల  పైలాన్ ప్రారంభించి, యువగళం పాదయాత్రలో లోకేష్ తో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగిన బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి .ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల ఆశీర్వాదంతో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ... విజయవంతంగా 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుందని తెలిపారు.   అధికార పార్టీ నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజల ఆశీస్సులతో రెండు వేల కిలోమీటర్లు మైలురాయిని చేరుతుందని తెలిపారు