హిందూపురం : పురపాలక సంఘం పరిధిలో ఇంటింటి చెత్త సేకరణకు సంబంధించి వసూలు చేయాల్సిన యూజర్ ఛార్జీలు తప్పని సరిగా వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ శానిటేషన్ సెక్రటరీలను ఆదేశించారు. పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం యూజర్ ఛార్జీలపై శానిటేషన్ సెక్రటరీలు, మెప్మా సిఓలు, ఆర్‌పిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతు పురపాలక సంఘ వ్యాప్తంగా 22 వాహనాల్లో ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోంది. ప్రతి వార్డులో వంద శాతం యూజర్ ఛార్జీలను ఆయా సచివాలయ సెక్రటరీలు వసూలు చేయాలన్నారు. దీనికి మెప్మా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌పిలు సహకరించాలన్నారు. ఆర్‌పిలు ఆయా ప్రాంతాల్లో ఉన్న మహిళలను చైతన్యం చేసి ప్రతి నెలా అందరూ చెల్లించే విధంగా చూడాలన్నారు. నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే సందర్భంగా రహమత్‌పురంలో అత్యధిóకంగా యూజర్ ఛార్జీలు వసూలు చేయడంతో అతన్ని అభినందించారు. సమావేశంలో మున్సిపల్ ఎఈ నాగేంద్ర, శానిటరి ఇన్స్‌పెక్టర్ నెట్టికల్లు తదితరులు పాల్గొన్నారు.
రీ సర్వేను సకాలంలో పూర్తి చేయండి
పురపాలక సంఘం పరిధిలో భవనాలు, వాణిజ్య భవనాలు, ఖాళీ స్థలాలకు సంబంధించిన రీ సర్వేను వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్‌లో సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతు పురపాలక సంఘ వ్యాప్తంరరరరగా 16ఏ, 16ఏఏ పై సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ఇందులో ముఖ్యంగా 16ఏ కింద ఇప్పటికే ఆస్తి పన్నులు చెల్లిస్తున్న యజయానుల వివరాలను, 16ఏఏ కింద ఖాళీ జాగా పన్ను కడుతున్న యజమానుల వివరాలు ఆన్‌లైన్ చేయాలన్నారు. సర్వేను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. అలాగే పురపాలక సంఘ వ్యాప్తంగా అక్రమ కట్టడాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎసిపి ఆనంద్ కుమార్, అధికారులు రాము, రామాంజి తదితరులు పాల్గొన్నారు.










