Oct 31,2023 20:01

మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు

 ప్రజాశక్తి-గుడ్లూరు : మండలంలోని స్వర్ణజపురం చెరువులో జెసిబి సహకారంతో ఎర్రమట్టిని గత వారం రోజులుగా ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని రాత్రింబవళ్లు తరలిస్తున్న అధికారులు పట్టిం చుకోవడంలేదని గ్రామస్తులు విమర్శించారు. మట్టిని తరలించేందుకు భారీ గోతులు తవ్వి ఇష్టను సారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. పొలాలని ప్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు ఈ మట్టిని ఉపయోగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మేలు రకం గ్రావెల్‌ మట్టి ఇక్కడ దొరకడంతో ఈ మట్టి దగ్గరకి వచ్చింది రాజకీయ పలుకుబడి ఉపయోగించి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చక్రం తిప్పుతూ చెరువు మట్టితో లక్షలు సంపాదిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అక్రమ తరలింపును అడ్డుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.