Nov 02,2023 18:34

అక్రమంగా లే అవుట్‌ వేసిన దృశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండలంలో అక్రమ లే అవట్లు వెలుస్తున్నాయి. నరుకూరు నుంచి కోడూరు వె ళ్లే ఆర్‌ అండ్‌ బి రోడ్డు పక్కన సర్వే నంబర్‌ 12, 13లలోని సుమారు 10 ఎకరాల్లో ఓ వెంచర్‌ వెలిసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు నిర్మించిన ఈ వెంచర్‌ గుండా ఇరిగే షన్‌ శాఖకు సంబంధించిన పారుదల కాలువ వెళుతుంది. వైసిపి నాయకుల అండతోనే రియల్టర్లు దర్జాగా ఇరిగేషన్‌ కాలువను కబ్జా చేశారన్న ప్రచారం జరుగుతోంది. సంబంధిత శాఖ ఉన్నతధికారులు స్పందించి అక్రమణ చెర నుంచి కాలువను కాపాడాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
కాలువ ఆక్రమణపై విచారణ చేస్తాం : ఎఈ
నరుకూరులో న్యూ బాలాజీ పారుదల కాలువ అక్రమణకు గురైన విషయం తన దష్టికి రాలేద ని ఇరిగేషన్‌ ఏఇ విజయ భాస్కర్‌ రెడ్డి తెలిపారు. తమ విచారణలో కాలువ అక్రమణకు గురై నట్టు నిర్ధారణ అయితే తప్పకుండా చర్యలు తీ సుకొంటామని విజయ భాస్కర్‌ రెడ్డి చెప్పారు.