Oct 31,2023 19:51

ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

ప్రజాశక్తి -నెల్లూరు డెస్క్‌ :నేషనల్‌ లెవెల్‌ యోగ పోటీల్లో విజేతలకు నిలిచిన ఓవల్‌ మోడ్రన్‌ పాఠశాల విద్యార్థులు తమిళనాడు రాష్ట్రంలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వారు అక్టోబర్‌ 24న చెన్నైలో నిర్వహించిన నేషనల్‌ లెవెల్‌ యోగ పోటీలు నిర్వహించారు. దాదాపు 2, 000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ఓవెల్‌ పాఠశాల నుంచి పాల్గొన్న విద్యార్థులు జె. శశిధర్‌, 8వ తరగతి, 6వ తరగతి విద్యార్థులు డి. జోషిత, జి. మోక్షిత, వి. సాయి మహేష్‌, బి. వేదాక్షరి నేషనల్‌ లెవల్లో నాలుగో బహుమతిని సాధించారు.ఎంచేతన్‌ రామ్‌( 5వ తరగతి) డి. కుందశ్రే (4వ తరగతి) విద్యార్థులు జాతీయ స్థాయిలో 6వ బహుమతి సాధించారు. జె.పునర్వి ఎం.దీషిత, వి.లక్ష్మీ సాయి, మెడల్స్‌ ను, సర్టిఫికెట్లు సాధించి విజేతలుగా నిలిచారు. భాగంగా విద్యార్థులను అభినం దించడానికి పాఠశాలలో అభినంద సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఓవెల్‌ పాఠశాలల ఛైర్మన్‌ అర్‌.వేణు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్‌ యు. రమణ నాయుడు, జియం.మహదేవ్‌, డిజిఎం శ్రీనివాసులు, హై స్కూల్‌ ఇన్చార్జ్‌ ప్రసాద్‌ రెడ్డి,ప్రైమరీ ఇంచార్జ్‌ రమాదేవి, ఎజిఎం సునీల్‌ పాల్గొన్నారు.